మధురై యాత్ర గురించి…………….

మాకు ఒక్కసారి గా మూడు రోజులు సెలవులు రావడం వలన మా స్నేహితులం అందరము కలిసి విహార యాత్ర కి వెళ్దామని అనుకొన్నాము. కాని అనుకోకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము.అలా మధురై,రామేశ్వరం బయలుదేరాము.మేము బెంగుళురు నుండి శుక్ర వారం రాత్రి బయలుదేరి శని వారం ఉదయానికి మధురై చేరుకున్నాము.ఆలయము చాలా పురాతనమైనది. అక్కడ కొలనులో బంగారు అద్దకము కలిగిన తామర పుష్పము వున్నది.ఇది చాలా ప్రాముఖ్యము కలిగినది. ఆ రోజు మీనాక్షి అమ్మవారి దర్శనము తొ పాటు అక్కడే ఉన్న శివయ్యను,విఘ్నేశ్వరుని దర్శించుకొనే సరికి మధ్యాహ్నం అయింది. దగ్గర లొ భొజనం ముగించుకొని అక్కడ నుంచి రామేశ్వరము బయలుదేరాము.మేము వెళ్ళేసరికి రాత్రి 8 గంటలు అయింది. ఒక అథిది గౄహము తీసుకొని రాత్రి కి అక్కడ బస ఛేశాము. తెల్లవారుజామునే లేచి రామనాధ స్వామి వారి స్పటిక లింగ దర్శనము చేసుకొన్నాము. ఈ స్పటిక లింగ దర్శనము  అనేది దినము లొ కేవలము తెల్లవారుజామున మాత్రమే ఉండును. అలా ముగించుకున్న తరువాత సముద్ర స్నానము చేశాము.ఇక్కడ మీకో విషయము చెప్పాలి ఈ సముద్రములొ ప్రత్యేకత ఏమిటి అంటే అలలు రావు. ఆ తరువాత ఆలయము లో ఉన్న 22 పుణ్య తీర్థముల (బావులు)  నీటిని  శిరస్సు మీద చల్లించుకొని పవిత్రులమయ్యాము. మళ్ళీ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడే ఉన్న పురాతన ప్రదేశాలను తిలకించాము.ఇంక అక్కడ నుంచి రైలు లొ బయలుదేరాము ఆ రోజు సాయంత్రం 4:00 గంటలకు. ఆ రాత్రికి మధురై చేరుకున్నాము. అక్కడి నుంచి మళ్ళి బెంగళురు చేరుకున్నాము. ఆ రైలు లొ వచ్చేటప్పుడు కలిగిన ఆహ్లాద అనుభూతులు వర్ణించ జాలనివి. ముఖ్యముగా రామేశ్వరం నుంచి మధురై కి……………….. రామేశ్వరం విశిష్టత గురించి రేపటి ప్రచురణ లో……


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: