మనందరికి రామాయణం గురించి తెలుసు.రావణుడు సీత ని అపహరించడం, సీత కొసం రాముడు రావణుని తొ యుద్దం చేసి రావణుని వధిస్తాడు.కాని ఇక్కడ చాల మంది రావణుడు ఒక రాక్షసుడు గా తెలుసు కాని అంతకంటే ముందు ఆయన ఒక బ్రాహ్మణుడు, అంతే కాక చాలా శక్తివంతుడు. ఎంత శక్తి వంతుడు అంటే ఒక్క రోజులో కోటి శివలింగాలను పూజిస్తాడు.కాని తను చేసిన చిన్న పొరపాటే తన వినాశనానికి దారి తీసింది.అదే పరస్త్రీ నీ కోరుకోవడం.రావణుడు రాక్షసుడు అయిన కాని బ్రాహ్మణుడు…బ్రాహ్మణ హత్య పాపం కాబట్టి ఆ పాప పరిహారం రాముడు కి కూడ తప్పలేదు.రాముడు లంక వెళ్ళడానికి వారధి నిర్మించిన చోటనే శివ పూజ చేయాలని భావించారు.కావున కైలాసానికి వెళ్ళి శివ లింగాన్ని తెమ్మని హనుమంతుని పంపించారు. కాని హనుమంతుడు సమయము మించిన రాక పొయే సరికి పార్వతి దేవి ఇసుక తో శివలింగాన్ని ప్రతిష్టించింది.అలా పూజ మొదలు పెట్టారు. అంతలో హనుమంతుడు కైలాసం నుంచి కూడ శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. తాను తీసుకొని వచ్చిన లింగానికి పూజ చేయమని ఇసుక తో ఉన్నదాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసాడు.కాని విఫలం అయ్యాడు.ఎందువలన అంటే శివలింగం ఇసుక తో చేసిన మహిమ కలిగినది కాబట్టి.వెంటనే రాముడు హనుమతునికి ఒక వరం ఇస్తాడు నీవు తేచ్చిన లింగానికి పూజ జరిగిన తరువాతే నే ఈ లింగానికి పూజ జరుగుతుందని. అదే స్పటిక లింగం.అలా రాముడే పూజించాడు కాబట్టీ అక్కడ ఉండే శివుడు రామనాధ స్వామి గా ప్రాచుర్యం పొందాడు. అంతే కాక హనుమంతుడు కైలాసం నుండి రెండు శివలింగాలను తెచ్చాడు.ఒకటి పైన వివరించినది. దీని ఎత్తు తొమ్మిది అంగుళాలు.మరొకదాని ఎత్తు తొమ్మిది అడుగులు.అది అక్కడే రాములవారి ఏకాంత మందిరం లొ వుంటుంది…..రామేశ్వరం దక్షిణ కాశి గా ప్రశిద్ది….ఇక్కడ వుందే 22 తీర్థముల నీటిని శిరస్సు మీద చల్లుకొనిన పవిత్ర గంగానది లొ మునిగినదాని తొ సమానమని ప్రసిద్ది.
9:35 సా. వద్ద 02/01/2013 |
baagunnadi
5:06 సా. వద్ద 31/01/2019 |
నాకు ఒక్క సందేహం
రామేశ్వరంలో నిద్ర చైయడం దేవుడు నీ దర్శనం చేసిన తరువాత మాంచిద