పశ్చాతాపం

ఒక వ్యాపారికి రెండు గుర్రాలు ఉండేవి.వాటి మీద బియ్యం,పప్పు మూటలు వేసి ఊరూరు తిరిగి వ్యాపారం చేసేవాడు.ఒకసారి ఆ రెండు గుర్రాలలో ఒకదానికి జబ్బు చేసింది.ఆ విషయం వ్యాపారికి తెలియదు.ఒకసారి రెండిటి పైన సమానంగా సరుకులు వేసి వేరే ఊరికి ప్రయాణం కట్టాడు.అసలే కొండదారి కావడం వలన జబ్బు చేసిన గుర్రం నడవలేక బాగా కష్టపడుతుంది.అప్పుడు ఆ గుర్రం రెండవదానిని సహాయం చేయమని ఇలా అన్నది.”నేను మోయలేక పొతున్నాను.నాకు వొంట్లో బాగా లేదు.నా పైన ఉన్న మూటలలో ఒక దానిని కింద పడేస్తాను.నీవు ఇక్కడే నిలబడు అప్పుడు వ్యాపారి నీ పైన వేస్తాడు.అప్పుడు నాకు కొంత భారం తగ్గుతుంది నేను నడవగలను.”
కాని రెండవ గుర్రం దానికి ఒప్పుకోదు.నేను నా బాగాన్ని మోస్తున్నాను నేను ఎందుకు నీ బరువు మోయాలి అని అంటుంది.ఆ మాటలకు జబ్బుతో ఉన్న గుర్రం ఏమీ మాట్లాడలేదు.పోను పోను దానికి జబ్బు ఎక్కువైంది.ఒక రాయి తగిలి లోయలో పడి చనిపొయింది.ఒక గుర్రం చనిపోవడంతో ఆ వ్యాపారి బాధపడి ఆ మూటలను రెండవ గుర్రం మీద వేసాడు.అప్పుడు రెండవ గుర్రం తను చేసిన తప్పు తెలుసుకొని లోలోపల మథనపడ సాగింది – “నా మిత్రుడు అడిగిన వెంటనే అడిగిన వెంటనే ఒక మూట మొసి ఉంటే నాకు ఇప్పుడు ఈ కస్టం వచ్చి ఉండేది కాదు” అని.
కష్టాలు వచ్చినప్పుడు మనం మిత్రులను ఆదుకొనక పోతే తరువాత పశ్చాతాపడాలిసి వస్తుంది.

ఇది నేను చిన్నప్పుడు మంచి కధలు అనే పుస్తకం లో చదివాను.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు to “పశ్చాతాపం”

 1. vijayabharathi Says:

  doing a good job by reminding all our childhood stories.

 2. నరసింహారావు మల్లిన Says:

  బాగుందండి.

 3. epraveenkumar Says:

  చాలా కృతజ్ఞతలు.

 4. రవి చంద్ర Says:

  బావుంది కథ.

 5. epraveenkumar Says:

  తప్పు సరిచేసాను.

 6. sUryuDu Says:

  Good one.

 7. Jithu Says:

  I like it !!!

 8. epraveenkumar Says:

  మీకు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది…….:)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: