మనఃశాంతి

ఒక వ్యక్తి జీవితం మీద బాగా విరక్తిచెందాడు.అలా మనఃశాంతి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు.అతనికి ఒక సాధువు కనిపిస్తాడు.ఆ సాధువు దగ్గరకి వెళ్ళి ఇలా అంటాడు “స్వామి నాకు ఒకేఒక గది కలిగిన ఇంటిలో నేను,నా భార్య,మా ఇద్దరు పిల్లలు,మా అమ్మనాన్న,అత్త మామలు ఉంటున్నాము దానితో నాకు మనఃశాంతి కరువైంది” మీరు ఎలాగైనా మనఃశాంతిని ప్రసాదించండి అని అడుగుతాడు.అప్పుడు ఆ సాధువు నీవు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఖచ్చితంగా మనఃశాంతి దొరుకుతుంది అని చెప్తాడు.ఆ వ్యక్తి చెప్పండి స్వామి నేను మీరు చెప్పింది చేస్తాను అని అంటాడు.
సాధువు ఇలాచెప్తాడు వాళ్ళ అందరితో పాటు నీ గేదలను,కోళ్ళను,కుక్కను నీ ఇంటిలో ఉంచుకొని వారం రోజుల తరువాత నా దగ్గరకు రా అని చెప్తాడు.అతను వెంటనే వెళ్ళి స్వామి చెప్పినట్లు చేస్తాడు.దానితో అతను ఇంకా విసుగు చెంది రెండవ రోజునే సాధువు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు “స్వామి నాకు ఇప్పుడు ఇంకా పిచ్చి ఎక్కిపోతుంది అని”.అప్పుడు ఆ సాధువు నీవు కొత్తగ తెచ్చిన వాటిని అన్నింటిని తిరిగి బయటకు పంపు అని చెప్తాడు.అతను వెంటనే వెళ్ళి ఆ పని చేస్తాడు.అప్పుడు అతనికి బాగా ప్రశాంతంగా ఉంతుంది.ఈ విషయాన్ని మళ్ళి వచ్చి సాధువుకి చేప్తాడు.
ఆ సాధువు తిరిగి ఇలా చెప్తాడు.నాయనా మనకు ఉండేవే కష్టాలు కాదు,దానికంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి.మనము ఉన్న పరిస్థితిలో నే ప్రశాంతత ఉంది అని భావించాలి. అప్పుడే మనం మనఃశాంతిగా ఉండగలం.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు to “మనఃశాంతి”

  1. jaya Says:

    అవునండి ప్రవీణ్ కుమార్ గారు. అందుకనే ఎప్పుడూ మనల్ని ఎప్పుడూ మనకంటే తక్కువ స్థాయిలోని వారితోటే పోల్చుకోవాలి. ఎక్కువ స్థాయి వారి తోటి పోల్చుకుంటే మన:శాంతి కరువే మరి.

  2. epraveenkumar Says:

    బాగా చెప్పారండి.

  3. శిశిర Says:

    “మనము ఉన్న పరిస్థితిలో నే ప్రశాంతత ఉంది అని భావించాలి. అప్పుడే మనం మనఃశాంతిగా ఉండగలం. ”

    నిజమే. చాలా బాగుంది.

  4. parimalam Says:

    మంచి కధ !

  5. a2zdreams Says:

    really good one

  6. krishna mohan Says:

    good

  7. krishna mohan Says:

    bagundi

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: