ఉపకారికి ఉపకారం

ఓ నది గట్టు మీద ఓ చెట్టు ఉండేది.ఆ చెట్టు కొమ్మ మీద ఓ పావురం కూర్చొని ఉంది.అది నీళ్ళలో ఒక చీమ కొట్టుకుపోవడం చూసింది.ఆ చీమ బయటపడాలని ఎంత ప్రయత్నించిన నీటి ప్రవాహనికి దాని ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి.ఇంకొద్దిసేపటిలో అది మునిగిపొవడం తరువాయి.ఇదంతాచూసిన పావురానికి జాలి కలిగింది.అప్పుడు అది తన ముక్కుతో ఒక ఆకు విరిచి చీమకు దగ్గరగా నీటిలో పడవేసింది. చీమ ఆకు పైకి వచ్చింది.ఆ ఆకు కొట్టుకుంటూ గట్టు దగ్గరకు వచ్చింది.గట్టు మీదకు వచ్చిన చీమ పావురానికి కృతజ్ఞత తెలిపింది.
అప్పుడే ఓ పిట్టలు పట్టేవాడు అక్కడికి వచ్చి చెట్టు కింద దాక్కున్నాడు.పావురం వాడిని గమనించలేదు.వలకట్టిన కర్రను మెల్లగా పావురం దగ్గరికి పోనివ్వసాగాడు.ఇది చూసిన చీమ గబగబా చెట్టు దగ్గరకి పొయింది.పాపం! దానికి మాట్లాడం రాదు.లేకపొతే పావురాన్ని పిలిచి చెప్పేది.తనను కాపాడిన పావురాన్ని ఎలగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. అది చెట్టు కింద కూర్చున్న పిట్టలు పట్టేవాడి తొడవరకు పాకి, వాడిని గట్టిగా కుట్టింది.
దెబ్బతో వాడు అబ్బా అని కదిలాడు,వాడి చేతిలో ఉన్న కర్ర కూడ కదలడంతో చెట్టు మీ ద ఆకులు గలగలా అన్నవి.ఆ చప్పుడుకు పావురం ఎగిరిపొయింది.కష్టాలలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది ఊరికే పోదు,మనకు కచ్చితంగా తిరిగి దాని ఫలితం లభిస్తుంది.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు to “ఉపకారికి ఉపకారం”

 1. రవి చంద్ర Says:

  నీ కథలన్నీ చదువుతుంటే మళ్ళీ ఒక్కసారి బాల్యం లోకి వెళ్ళిపోతున్నట్లుంది. ఈ కథ చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో చదివినట్లు గుర్తు.

 2. epraveenkumar Says:

  అవును ఇవన్ని చిన్నపటి మన పుస్తకాలలో చదివినవే.

 3. నవీన్ గార్ల Says:

  very valuable blog. keep it up. I appreciate your effort.
  very good… Keep writing.

 4. aswinisri Says:

  baavundi! annii chadiveasaa!!!!!!!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: