ఒక ఊరిలో ఓ రైతు ముంగిసను పెంచుకొనేవాడు.అది చాలా తెలివైనదే కాక, దానికి స్వామిభక్తి కూడ ఎక్కువ.ఒక సారి రైతు పని మీద బయటకి వెళ్ళాడు.రైతు భార్య తన పసిబిడ్డకు పాలిచ్చి ,నేల మీద పడుకోబెట్టింది.బావి నుంచి మంచి నీళ్ళు తీసుకొద్దామని కడవ,చేద(తాడు) తీసుకొని బయలుదేరింది. వెళ్తూ ముంగిసకి పాపని చూడమని చెప్పి వెళ్ళింది.
ఆమె వెళ్ళగానే పుట్టలో నుంచి ఒక నాగు పాము వచ్చి , ఇంటిలోకి ప్రవేశించింది.ఆ పాము చిన్నగా ప్రాకుకుంటూ పాప వైపు పోసాగింది.ఇది గమనించిన ముంగిస పాముని పట్టుకొని రెండు ముక్కలు చేసింది.తలుపు దగ్గరికి వచ్చి రైతు భార్య కోసం ఎదురు చూడసాగింది.ఆమె నీళ్ళు తీసుకొని వచ్చి తలుపుదగ్గర, మూతి నుండి రక్తం కారుతున్న ముంగిసను చూసింది.ముంగిస పాపను ఎక్కడ కోరికి పడవేసిందో అని అపార్థం చేసుకొని ఆ నీళ్ళ కడవను ఎత్తి దాని తల పైన వేసింది.దానితో అది చనిపొయింది.
ఆమె పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి చూస్తే పాప హాయిగా నిద్రపోతూ ఉంది.ప్రక్కన పాము రెండు ముక్కలై పడి ఉంది.అప్పుడు ఆమె తను పొరపాటు చేశానని తెలుసుకొని పరిగెత్తుకుంటూ ముంగిస దగ్గరకి వెళ్ళింది.కాని ఏమి లాభం అప్పటికి అది చనిపొయింది కదా! అప్పుడు దానిని ఒళ్ళో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.కాబట్టి ఏ పనైనా ఆలోచించకుండా చేస్తే తరువాత పశ్చాతాప పడిన ఉపయోగం లేదు.
1:15 ఉద. వద్ద 11/12/2009 |
మంచి కథలు రాస్తున్నారు. కీపిటప్. ఇంకా ఇంకా రాయండి. పిల్లలకు చాలా ఉపయోగం.
6:54 ఉద. వద్ద 15/12/2009 |
బాగుందండి… ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి కథలు వ్రాస్తున్నందుకు కృతఙతలు….