ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా పక్షులు ఉండేవి.దానికి దగ్గరలో ఒక రైతు పొలం ఉండేది.ఆ రైతు పొలంలో రోజు విత్తనాలు నాటి వెళ్ళడం ఆ పక్షులన్నీ తినేయడం జరుగుతుండేది.దానితో విసుగు చెందిన రైతు వాటి బెడద తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తాడు.ఒక పెద్ద వల తెచ్చి పొలం నిండా కప్పుతాడు.ఆ పక్షులన్నీ వచ్చి వాలుతాయి.వాటితో పాటు ఒక సారస పక్షి కూడా చిక్కుకుంటది.
ఆ రైతు వలలో పడిన ఒక్కొక్క పక్షిని పట్టుకోవడం మొదలుపెడతాడు.అప్పుడు ఆ సారసపక్షి రైతుని ఇలా వేడుకుంటది – “అయ్యా నన్ను వదిలిపెట్టండి. నేను కోడిని కాదు,కొంగను కాదు, విత్తనాలు తినే పక్షిని అసలే కాదు.పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న కీడ పురుగులు తినేదాన్ని అని”.
అసలే కోపంగా ఉన్న రైతు దానికి సమాధానంగా – ” నీ మాట నిజమే కావచ్చు.నా పొలంలో విత్తనాలు తినే పక్షులతో పాటు దొరికావు.కాబట్టి నీవు వాళ్ళ స్నేహితుడవే.నీకు కూడా శిక్ష తప్పదు అని చెప్తాడు.” కాబట్టి ఎవడైనా వెధవ పనిచేసేటప్పుడు మనం చేయకుండా పక్కన ఉన్నా అది మన మీదకు వస్తుంది.
8:06 ఉద. వద్ద 17/12/2009 |
పోయిన సంవత్సరం యాసిడ్ దాదికి గురి అయిన స్వప్నిక , మరియు దాడి చేసినతనికి పక్కనుండి చావుకి గురి అయినవారు మీరు చెప్పిన కధకి ఉదాహరణలు.
సుధ
8:16 ఉద. వద్ద 17/12/2009 |
అవును మీరు చెప్పింది నిజమే.
9:56 ఉద. వద్ద 29/12/2009 |
chalaa manchi pittakatha.