ఒక ఊరిలో ఒక కుర్రాడు గొర్రెలు కాస్తుండేవాడు.వాడు బాగా అబద్దాలు ఆడేవాడు.ఒకసారి గొర్రెలను తోలుకొని అడవికి బయలుదెరాడు.గొర్రెలు మేత మేస్తూ ఉంటే ” అయ్యో కాపాడండి! తోడేలు నా గొర్రెను తీసుకుపోతుంది అని అరిచాడు.ఆ కేకలు విని చుట్టు పక్కల ఉన్న వాళ్ళు పరిగెత్తు కుంటూ వచ్చారు. వాళ్ళని చూసి పక్కున నవ్వాడు.అందరు చిన్న మొహం వేసుకొని వచ్చినందుకు వాళ్ళను వాళ్ళు తిట్టుకొంటూ వెళ్ళి పొయారు.
ఒక రోజు నిజంగా తొడేలు వచ్చింది.అది గొర్రెల మీదకి వెళ్ళిని వాటిని పట్టుకుంది.ఆ కుర్రాడు నిజంగా భయంతో రక్షించండి! రక్షించండి! తోడేలు వచ్చింది అని అరిచాడు.అందరు వాడు ఒట్టి అబద్దాలు చెప్తున్నాడని ఎవ్వరూ పట్టించుకోలెదు.ఆ తొడేలు మంద మీద పడి ఒక గొర్రెను ఎత్తుకు పోయింది.కాబట్టి ఇలా వెకిలి చేష్టలు చేస్తూ, ఇంకొకళ్ళను వెధవలను చేస్తే మనమే నష్టపోతాం.
స్పందించండి