ఓ అడవిలో ఓ సింహం, ఓ చిరుత పులి ఉండేవి.సింహమేమో బలమైనది.కాని వయస్సు మళ్ళిన కారణంగా సరిగ్గా పరిగెత్త లేకపొయేది,వేటాడలేకపొయేది.చిరుత పులి బాగా బలంగా ఉన్నా, సింహమంటే భయపడేది,దానితో స్నేహం చేసేది.ఎందుకంటే అది మృగరాజు కాబట్టి.అది కాక ఆ సింహం ముసలిదైనా బాగా బలిష్ఠంగానే ఉండేది.
ఒకసారి ఎన్ని రోజులు గడిచినా రెంటికి ఆహారం దొరకలేదు.రెండూ ఆకలితో నకనక లాడుతున్నాయి.దగ్గరలో ఆకులు,అలమలు మేస్తున్న జింక పిల్లను చూశాయి.”నేను జింకపిల్లను వొడిసి పట్టేస్తాను.మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి.” అని చిరుత సింహంతో చెప్పింది.సరేనని సింహం దూరంగా వుండి పోయింది.చిరుతపులి పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని జింక పిల్లను కొరికి చంపేసింది.ఆ జింకపిల్ల మరీ చిన్నదిగా ఉండటంతో అది ఒకరికే సరిపోయేలాగ ఉంది.కాని అవి రెండు బాగా ఆకలిగా ఉన్నాయి.రెంటి నోళ్ళు ఊరుతున్నాయి.”జింక పిల్లను నేనే చంపాను కాబట్టి దీన్ని నేనే తింటాను.” అంది చిరుత.
“నేను మృగరాజుని తెలుసా! కనుక నేనే జింకపిల్లను తింటాను.ఎలాగూ నీవు బాగా పరిగెత్తగలవు.కనుక ఇంకో జంతువును వేటాడి తిను.” అని గర్జించి చెప్పింది సింహం.ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.రెండు ఒకదాని మీద ఒకటి పంజా విసురుకొవడం మొదలుపెట్టయి.ఆ ప్రక్కనే పొదల చాటున ఒక నక్క దాక్కొని ఇదంతా చూస్తూ ఉంది.సింహం,చిరుత బాగా పోట్లాడుకొని అలసి పడిపోయాయి.అదే అదనుగా భావించి ఆ జింకపిల్లను నక్క వచ్చి లటుక్కున ఎత్తుకొని పోయింది.కాబట్టీ ఆలొచించకుండా అనవసరంగా పోట్లాడుకుంటే అది మనకు కాకుండా ఇంకరికి పోతుంది.అదే అవి రెండు సమానంగా పంచుకొని ఉంటే వాటికి కనీసం కొంతయినా ఆకలి తీరి ఉండేది.
8:58 ఉద. వద్ద 27/01/2010 |
కధ బాగుంది. మరో కధ విను. ఒక అరబ్ ఉండేవాడు. అతనికొక ఒంటె. ఒక తీవ్రమైన చలిరాత్రి. ఒంటె చలికి తాళలేక గుడారంలో తలమాత్రం పెట్టుకుంటానంటుంది. అతని మనసు కరిగి సరే అంటాడు. ఒంటె తల ను నెమ్మది నెమ్మదిగా లోనికి తోస్తుంది. మెడ. తర్వాత కాళ్ళు. మొత్తం వొళ్ళు. చివరికి ఆశ్రయం ఇచ్చిన అరబ్బీనే బయటికి తోస్తుంది. చెడ్డవాడికి ఆశ్రయం ఇస్తే అంతే కాదా.
10:02 ఉద. వద్ద 27/01/2010 |
మీరు చెప్పింది నిజమే…అది సందర్భాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది..మనకి తెలిసి “ఆలస్యం అమృతం విషం ” అంటారు…..అలాగే “నిదానమే ప్రదానం” అంటారు. అలా ని ఎప్పుడూ నిదానంగా ఉండలేం కదా……ఎప్పుడూ పరిగెత్తలేము కదా!…కాబట్టి అది సందర్భాన్ని ఆధారపడి ఉంటుంది అని అన్నాను.మీరు ఒక కోణం ఆలోచించి నాకు అరబ్బు కధ చెప్పినట్లున్నారు….నా కధ మీకు వ్యతిరేక కోణం లోనిది.
5:12 సా. వద్ద 27/01/2010 |
yes. పరిస్దితి బాలేదు. ఇప్పుడు అందరూ అవే రాస్తున్నారు. సో మేం జాగ్రత్తపడటం అనివార్యం అయింది.
10:57 సా. వద్ద 27/01/2010 |
మేము జాగ్రత్త పడాలి అంటే మీరు ఎవరు?…..:)