ఉదయవీర్ మొదట్లో చాలా పేదవాడుగా ఉండేవాడు.అతను సాధారణ సిపాయిగా ఉండేవాడు.ఓ రోజు తుపాకి తీసుకొని గుర్రమెక్కి వేటకి వెళ్ళాడు.ఆ రోజు అడవి అంతా గాలించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు.అలా చాలా దూరం వెళ్ళగా ఒక జింక,జింక పిల్ల కనపడ్డాయి.గుర్రాన్ని జింకల వైపు పరిగెత్తించాడు.జింకేమో పరిగెత్త్తి పొదలో దాక్కుంది, పాపం జింక పిల్ల దొరికిపోయింది.దాని నాలుగు కాళ్ళు కట్టివేసి గుర్రం మీద వేసి దాని తల్లి కోసం గాలించసాగాడు.ఎంత వెదికినా అది కనపడక పోవడంతో నిరాశ చెంది తిరిగి పోసాగాడు.
ఉదయవీర్ తనపిల్లను బంధించి తీసుకొని పోతూండటం తల్లి జింక చూసింది.బిడ్డ మీద ప్రేమ కొద్ది,అది పొద నుంచి బయటకి వచ్చింది.ఉదయవీర్ గుర్రం వెంట పరిగెత్త సాగింది.కొంచెం దురం వెళ్ళాక ఉదయవీర్ వెనక్కి తిరిగి చూశాడు.తన వెంబడే జింక రావడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది.అతని హృదయం కరిగి పోయింది. జింక పిల్లను వదిలి పెట్టాడు.జింక సంతోషంతొ పిల్లతో సహా ఎగెరుకుంటూ అడవిలోకి పారిపోయింది.
కొంతకాలానికి అతను చక్రవర్తి అయ్యాడు.కాబట్టీ మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు.అది ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుంది.అదే ఉదయవీర్ విషయంలో నిజమైంది.
1:09 ఉద. వద్ద 28/01/2010 |
మంచి కధ ! దయకు దొరికిన ఫలం అన్నమాట !
10:14 ఉద. వద్ద 28/01/2010 |
కాదంటారా… 🙂
3:01 ఉద. వద్ద 28/01/2010 |
దయ కి ఫలితం అప్పుడే దొరకచ్చు, ఆ జన్మలో దొరకచ్చు, అసలు దొరకక పోవచ్చు కూడా.
అలా అని జాలి, దయ అనే లక్షణాలని మనిషి ప్రతిఫలాపేక్ష తో కాకుండా సాటి జీవి అనే భావన తో చేస్తె తప్పక దొరుకుతుంది.
ఇటువంటి భావనలు జంతువులకి సాధ్యం కాదు, మనిషికి మాత్రమే వీలైనవి. అదే మనిషిని జంతువు నించె వేరు చేస్తున్నది.
10:14 ఉద. వద్ద 28/01/2010 |
అవును మీరు చెప్పింది నిజమే…..