ఒక ఊరికి దగ్గరలో సారసపక్షుల జంట నివసిస్తూ ఉండేది.ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది.కొంత కాలానికి గుడ్లలోనుంచి పిల్లలు బయటకి వచ్చాయి.వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరాటానికి ముందే పంటకోతకు వచ్చింది.సారసపక్షులకు దిగులు పట్టుకుంది.రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి వెళ్ళాలి.కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి ఇలా అంది – ‘మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.
ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయంకాలం గూడు చేరుకొంది.అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి – ” ఈ రోజు రెతు వచ్చాడు.పొలం చుట్టూ తిరిగాడు.ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలంవైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది.ఇక కోయాల్సిందే. ఈ రోజే వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో నా చేను కోయమని చెప్తాను.” ‘మీరేమి భయపడకండి.రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మన్మ్ ఇక్కడే హాయిగా ఉండచ్చు.” – అని పక్షి పిల్లలతో చెప్పింది.
కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకుంది.అప్పుడు పిల్లలు బిక్కు బిక్కిమంటూ ఇలా చెప్పాయి – మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్ళాలి. ఈ రోజు రైతు మళ్ళీ వచ్చాడు. ఊళ్ళోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు.నేను నా అన్నదమ్ములిని పిలిపించి కోయిస్తాను.” సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది – “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు.నాలుగైదు రోజుల్లో మీరు ఇంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటీకి పోనక్కర్లేదు.’
ఇలా మరిన్ని రోజులు గడిచి పొయ్యాయి.సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారసపక్షితో ఇలా అన్నాయి.- “ఈ రైతు మమ్మలిని ఉత్తుత్తినే భయపెడుతున్నాడు.ఇతడు పైరు కోసినట్లే.ఈ రోజు కూడా వచ్చాడు.” “నా అన్నదమ్ములు కూడా నా మాట వినడం లేదు.పైరు బాగా ఎండి పోయి గింజలు నేల రాలుతున్నాయి.రేపు పొద్దుపొడవగానే నేనే వచ్చి మొదలెడతాను.” అని అన్నాడు. అప్పుడు సారసపక్షి భయపడింది. – “అరరే! వెంటనే బయలుదేరండి.ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్ళి తలదాచుకొందాం.రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని అంది.
పిల్లలు ఆదుర్దాగా అడిగారు – “ఎందుకు వెళ్ళాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?” సారసపక్షి ఇలా బదులు చెప్పింది – “రైతు గ్రామస్తులను , సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలగలేదు.తనపని తాను చేయకుండా, ఇతరులను నమ్ముకున్నంత కాలం ఎవరి పనులు జరగవు.కాని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నిర్ణయించుకొన్నప్పుడు అవి జరిగిపోతాయి. రైతు తానే పంట కోస్తాను అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగిపోతుంది.” ఆ సారసపక్షులు వెంటనే సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయాయి.
1:32 ఉద. వద్ద 04/02/2010 |
Good one !
1:59 సా. వద్ద 04/02/2010 |
ప్రవీణ్ గారు మీ బ్లాగ్ చూశాను… చాలా బాగుంది… కొనసాగించండి…!!
2:01 సా. వద్ద 04/02/2010 |
gud message
2:14 సా. వద్ద 04/02/2010 |
@అభిజ్ఞాన , sunnygadu : ధన్యవాదాలు….. 🙂
@siva, తప్పకుండా కొనసాగిస్తాను…..