ఓ అడవిలో కుందేలు ఒకటి ఉండేది. సాధారణంగా కుందేళ్ళు చిన్నవిగా ఉన్నా వేగంగా పరిగెత్తతాయి. ఆ కుందేలు తన కన్నా వేగంగా ఎవరూ పరిగెత్తలేరని విర్రవీగుతూ ఉంది. అక్కడ పక్కనే ఆ మాటలు విన్న తాబేలు – ” అన్నా! నీవు చాలా వేగంగా పరిగెత్తగలవు. కాని అంత గర్వం పనికి రాదు, అలాఅయితే ఎప్పుడొ ఒకసారి అవమాన పడక తప్పదు” అంది. దానికి బదులుగా కుందేలు – ” నీకు ఉన్న మాట అంటే ఉలుకెందుకు? నీవు పురుగులాగా చిన్నగా పాకుతూ ఉంటావు. నన్ను చూసి నీకు కడుపు మంట.” అంతే కాక అలా ప్రతిసారి తాబేలును కుందేలు అవమానించ సాగింది. అవి భరించలేక ఒకసారి తాబేలు – ” ఊరికే గొప్పలు చెప్పుకోవటం కాదు.నాతో పందెం కాయి. ఎవరు గెలుద్దారో చుద్దాం ! ” అన్నది. కుందేలు దూరంగా ఉన్న ఒక చెట్టుని చూపించి తాబేలుతో ఇలా చెప్పింది – “అలాగే కానివ్వు. ఆచెట్టు వద్దకు ఎవరు ముందుగా వెళ్తారో , వాళ్ళే పందెం గెలిచినట్లు. సరేనా?”
పాపం! తాబేలు నిదానంగా దేకుతుంది. అది చెట్టుకు కాసింత దూరంలో ఉండ గానే, మొదలు పెట్టినానేను నాలుగు గెంతులు గెంతితే చాలు, దాన్ని దాటి పోగలను” అని భావించింది కుందేలు. అందుకని ధీమాగా తాబేలుతో ఇలా అంది. “నీవు వొట్టి సోమరివి. మెల్ల మెల్లగా నడిస్తావు. నివు నడువు. నేను కాసేపాగి వస్తాను.” “పరుగుపందెం ఈ క్షణమే మొదలైనట్లు తెలిసిందా? నీ ఇష్టం వచ్చినప్పుడు రా నాకేం?” తాబేలు చెప్పింది. ఆ మాటలకు కుందేలు తల ఊపింది. “ఇది చెట్టు వరకు వెళ్ళడం అంటే తెల్లారినట్లే. అందాకా ఓ చిన్న కునుకు తీస్తా” అనుకొంది కుందేలు. అది అక్కడే పడుకొని కునుకు తిసింది. మెలుకువ వచ్చేసరికి ఎంత సేపు నిద్ర పోయిందో తెలిసింది కాదు. వెంటనే గబగబా గెంతు కుంటూ చెట్టువద్దకు వెళ్ళింది. కాని తన కంటే తాబేలు ఉండటం చూసి సిగ్గుతో తల దించుకొంది. అంత గర్వం పనికి రాదని తెలుసుకొంది.