అవి మండుటెండలు గల రోజులు.పొలాల్లో ఎలాంటి పంటలు లేని కారణంగా కుందేళ్ళు ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి.మైదానాలలో పొదలు ఎండిపొయాయి.కుక్కలు విచ్చలవిరివిగా తిరగడం వలన పాపం వాటికి బయటకి రావాలంటే భయమేయసాగింది.దానితో దిక్కు తోచక అన్నీ కలిసి సమావేశమయ్యాయి.
ఓ కుందేలు ఇలా అంది – “బ్రహ్మదేవుడు మనజాతికి చాలా అన్యాయం చేశాడు.మనల్ని చిన్నవిగా,చేతగాని ప్రాణుల్లా సృష్టించాడు.దుప్పుల్లాగా కొమ్ములు ఇవ్వలేదు,పిల్లులకి మాదిరిగా పెద్దగోళ్ళు ఇవ్వలేదు.శత్రువుల నుంచి ప్రాణాలు రక్షించుకోలేము.ఎవరైనా మన మీద దాడి చేస్తే పారిపోవటం తప్ప ఇంకో మార్గం లేదు.” ఇంకో కుందేలు “ఈ కష్టాలు ,భయాలు నాకొద్దు బాబు! నేను ఏ చెరువులోనో పడి చచ్చిపోవాలనుకొన్నానూ అని అంది.మరొ కుందేలు ఇలా చెప్పింది – ‘నేను కుడా చచ్చిపోవాలనుకొన్నాను.నేను ఇంకెంత మాత్రమూ ఈ కష్టాలు పడలేను.నేనిప్పుడేవెళ్ళి చెరువులో దూకి చస్తాను.” “మేము కూడా నీవెంటే వస్తాం.మనమంతా కలిసే బతికాం, కలిసే చద్దాం.” – అని అన్నీ ఒక్కసారిగా అరిచాయి.అలా చావడనికి చెరువు వైపు బయలుదేరసాగాయి.
కుప్పలు తిప్పలుగా కప్పలు చెరువు గట్టు మీద కూర్చున్నాయి.కుందేళ్ళ అలికిడి వినగానే అవి భయపడి చెంగుచెంగున చెరువులోకి దూకాయి.కప్పలు భయపడి నీళ్ళలోకి దూకడం చూసి కుందేళ్ళు ఆగిపొయ్యాయి.అప్పుడు ఓ కుందేలు తోటి మిత్రులతో ఇలా అంది – “సోదరులారా! మనం చావలిసిన పని లేదు.రండి తిరిగి వెళ్దాం.దేవుని సృష్టిలో మనకంటే చిన్నవి,భయపడే ప్రాణులూ ఉన్నాయి.అవి బతుకుతున్నప్పుడు, మనమెందుకు చావాలి?’
ఆ మాటలు విన్న మిగతా కుందేళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా తిరిగి వెళ్ళాయి.కాబట్టి కష్టాలు అనేవి అందరికి ఉంటాయి.మనకంటె హీనంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు.మనమే వాళ్ళకంటే ఎంతో సుఖంగా ఉన్నాం అనుకొంటే ఎవరికీ ఎటువంటి కష్టాలు ఉండవు.
3:54 ఉద. వద్ద 26/01/2010 |
Good story
10:32 ఉద. వద్ద 26/01/2010 |
ధన్యవాదాలు…… 🙂
1:52 సా. వద్ద 26/01/2010 |
Good one.!
3:39 సా. వద్ద 26/01/2010 |
కృతజ్ఞతలు.
10:50 సా. వద్ద 26/01/2010 |
Good one Praveen…..
6:51 సా. వద్ద 27/01/2010 |
Good one praveen…
10:59 సా. వద్ద 27/01/2010 |
@ రవి చంద్ర & Yogi ధన్యవాదాలు…… 🙂