ఆవు – దూడ

ఒక సారి మేత మేయడానికి ఆవు ఒకటి ఆడవికి వెళ్ళింది.అలా మేస్తూ అది బాగా ఆడవిలోకి వెళ్ళిపోయింది.అక్కడ ఒక పులి ఆవుని చూసింది.ఆవుని తినాలని దాని దగ్గరకి వచ్చింది.ఆవుతో ఇలా అన్నది – “నాకు బాగా ఆకలిగా ఉంది.నేను నిన్ను తినాలని అనుకొంటున్నాను.” అప్పుడు ఆవు – “అయ్యా పులిగారు తప్పకుండా నన్ను తినండి.కాకపోతే నాదొక విన్నపం.నా కోసం నా బిడ్డ ఎదురుచూస్తుంటుంది.దానికి కాసిన్ని పాలు ఇచ్చి మీదగ్గరకి వస్తాను ” అని అంటుంది.

అప్పుడు పులి నేను నిన్ను ఎలా నమ్మేది అని అడుగుతుంది.ఆవు నేను ఖచ్చితంగా వస్తాను.ఒక వేల ఇప్పుడు మీ దగ్గరనుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన ఎప్పటికైన మీకు దొరకకమానను. నామీద నమ్మకం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటుంది. సరేనని పులి అనుమతి ఇస్తుంది.ఆవు ఆనందంతో ఇంటికి వెళ్ళి తన దూడకి పాలు ఇచ్చి దానికి కొన్ని మచి బుద్దులు చెప్పి పులి దగ్గరకి బయలుదేరుతుంది.అలా పులి దగ్గరికి చేరుకొని ఇలా అంటుంది – “నేను వచ్చేశాను .ఇప్పుడు మీరు నన్ను ఆరగించండి.” ఆవు నిజాయితికి ఆశ్చర్యపోయిన పులి తిరిగి – ” నీ నిజాయితికి నేను ముగ్ధుడను అయ్యాను.నీవు వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు నిన్ను వదిలిపెడుతున్నాను.” అని అంటుంది.ఆవు పులికి కృతజ్ఞతలు తెలిపి తన దూడ దగ్గరికి వెళ్ళిపోతుంది.

4 వ్యాఖ్యలు to “ఆవు – దూడ”

  1. padmarpita Says:

    క్షమించాలి….ఇది దయకు దొరికిన ఫలమా!
    లేక నిజాయితీకి దక్కిన ప్రతిఫలమా!

  2. వశిష్ఠ Says:

    పిచ్చపులి

  3. వశిష్ఠ Says:

    మంచి ఆవు

వ్యాఖ్యానించండి